-->

జనని సురక్ష యోజన (Central Government Schemes | Schemes | Ministry of Finance | Government of India )

Also Read

తల్లి బిడ్డ చల్లగా ఉంటే అందరికీ సంతోషం. భవిష్యత్తుకు మంచి బాట పడుతుంది. అందుకే మాతా శిశు ఆరోగ్య విషయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటికీ, సమస్య మానవాళి ముందు ఒక పెనుసవాలుగానే నిలిచింది. అందుకే జాతీయ అంతర్జాతీయ విధానకర్తలు సమస్యను అత్యంత ప్రాధాన్యతాంశాలలో ఒకటిగా భావిస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రసవ మరణాలు చాలా ఎక్కువగా, ప్రమాదస్థాయిలో ఉంటున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదికలను అనుసరించి 99% ప్రసవమరణాలు, వెనుకబడిన దేశాలలోనే సంభవిస్తున్నాయి. కేవలం భారత్‌, నైజీరియా దేశాలలో నాలుగింట మూడువంతుల మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో గర్భసంబంధిత మరణాలు ప్రపంచ మరణాలలో 22%గా ఉన్నాయి. తల్లి ప్రాణాలను కాపాడ్డం పాలకుల నైతిక బాధ్యత.

తీవ్ర పేదరిక నిర్మూలన, శిశు మరణాల తగ్గింపు, హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌ వంటి జబ్బుల నివారణ వంటి శతాబ్ది లక్ష్యాల సాధనకు - తల్లి ఆరోగ్యానికి స్పష్టమైన ప్రత్యక్ష సంబంధం ఉంది. పునరుత్పత్తి మరియు శిశు అరోగ్యం (రప్రాడక్టివిటి మరియు చైల్డ్‌ హెల్త్‌ - ఆర్‌సిహెచ్‌) కార్యక్రమంలో ఒక సర్వే జరిపారు. అందులో ఆసుపత్రి ప్రసవాలు మరీ తక్కువగా ఉండడం సమస్యకు ప్రధాన కారణంగా నిర్ధారించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలు, మారుమూల గ్రామాల్లో గర్భం దాల్చిన స్త్రీలు వైద్య సేవలను పొందడం లేదు. పైన ఆసుపత్రి ప్రసవాలు ఇంచుమించుగా లేవని గుర్తించారు. సమస్యను ఎదుర్మోవడానికి, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ హెచ్‌ఎమ్‌) కింద జనని సురక్ష యోజన (జెఎస్‌వై) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పేద కుటుంబాలకు చెందిన గర్భిణీ స్రీలు వైద్యసేవలు వినియోగించుకుని, ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేలా ప్రోత్సహించడానికిగాను నగదు ప్రోత్సాహకాలను ఇస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యక్రమాన్ని అమలు పరిచారు. అయితే 10 'లో పర్‌ఫామింగ్‌ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.   పథకం 19 సంవత్సరాలు, ఆపైని గర్భిణీ ప్రీలందరికీ వర్తిస్తుంది. కార్యక్రమం లక్ష్యాలు ప్రసవ మరియు శిశు మరణాలను తగ్గించడం, ఆసుపత్రి ప్రసవాలసంఖ్యను పెంచడం.

జెఎస్‌వై పథకం 2005, ఏప్రిల్‌ నుంచి అమలులో ఉంది. అయినా చాలామంది గ్రామీణ స్త్రీలకు దీని గురించి తెలియనే తెలియదు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి వర్గాలలోని చాలామంది స్త్రీలకు జెఎస్‌వై గురించి తెలియనే తెలియదు. పథకాన్ని గురించి జరగాల్సినంత ప్రచారం జరగ లేదు. ఆసుపత్రి ప్రసవాలు 25% కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాల (లో పర్‌ఫామింగ్‌ స్టేట్స్‌ (ఎల్‌పిఎస్‌) పై జెఎస్‌వై దృష్టి పెడుతుంది. ఎల్‌పిఎస్‌ రాష్ట్రాలలో బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, రూర్ధండ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌లు ఉన్నాయి. కాగా, ఇరు తెలుగు రాష్ట్రాలు హై ఫర్ఫామింగ్‌ స్టేట్స్‌ - హెచ్‌పిఎస్‌ లోకే వస్తాయి.

 

లో పర్‌ఫామింగ్‌ స్టేట్స్‌ (ఎల్‌పిఎస్‌) లో పేద గర్భిణీ స్త్రీలు జెఎస్‌వై పథకం నుంచి లబ్ధిని పొందేలా చేసే బాధ్యతను ఆషా (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిటీస్‌) వర్మర్లపై ఉంచారు. వారు తాము పనిచేస్తున్న గ్రామాలలో కింద పేర్కొన్న బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది.

 

ఆషా వర్కర్ల పాత్ర :

  • గ్రామంలో పథకం ద్వారా లబ్ధిని పొందగల గర్భిణీ స్త్రీలను గుర్తించడం.
  • గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం.
  • గర్భిణీ స్త్రీల పేర్లును నమోదు చేసుకోవడం మొదలు, ప్రసవానికి ముందు కనీసం మూడు సార్లు వైద్యపరీక్షలు చేయించడం, టెటనస్‌ ఇంజక్షన్‌ల నుంచి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లను వాడడం వరకు ఉన్న జాగ్రత్తలలో సహకరించాల్సి ఉంటుంది.
  • గర్భిణీ ప్రీలు జెఎస్‌వై లబ్ధిని పొందడానికి కావలసిన నమోదు కార్యక్రమం నుంచి జెఎస్‌వై కార్డును, బ్యాంకు ఖాతాను ప్రారంభించే విషయంలో కూడా సహకరించాలి.
  • గర్భిణీ ప్రీల ప్రసవానికి ముందుగా ఏర్పాట్టు,... సమీపంలో ఉండే వైద్య వ్యవస్థ/ ఆసుపత్రి సౌకర్యాల గురించి కాబోయే తల్లికి తెలియచెప్పాలి.
  • ప్రసవ సమయంలో గర్భిణీ ప్రీలను ఆసుపత్రికి తీసుకుపోవడం, వారు ఆసుపత్రినుంచి డిస్పార్డ్‌ అయ్యేవరకు వారికి తోడుగా ఉండాలి.
  • నవజాత శిశువులకు బిసిజి తో సహా అన్ని రోగనిరోధక టీకాలు వేయించాలి.
  • ప్రసవానంతర పరిశీలనకు గాను ప్రసవించిన ఏడు రోజుల్లోపుగా బాలింతను చూసి రావాలి.
  • బిడ్డకు తల్లి పాల విషయంలో తల్లికి సలహాలు ఇవ్వాలి.
  • కుటుంబ నియంత్రణ విధానాలను చెప్పి, పాటించేలా చేయాలి.

జెఎస్‌వై ఉద్దేశ్యాలు అమలులోకి రావడంలో అషా వర్మర్ల పాత్ర చాలా కీలకమైనది. ఆషా వర్మర్లతో పాటుగా నిరంతర అధ్యయన కేంద్రంగా ఉపయోగ పడాల్సిన వయోజన విద్యాకేంద్రాన్ని నడిపే ప్రేరక్‌లు / గ్రామసమన్వయకర్తలు / విలేజ్‌ కోఆర్జినేటర్లు / విసిఓలు సదరు సమాచారాన్ని గర్భిణీ ప్రీలకు తరుచుగా తెలియచెప్పవలసి ఉంది.

Close