-->

నీతీ ఆయోగ్‌ - బేటి బచావో - బేటిపడావో - కేంద్ర ప్రభుత్వ పథకాలు - ప్రజలకు వరాలు

Also Read

 

నీతీ ఆయోగ్‌ 

లక్కి గ్రాహక్‌ యోజన అండ్‌ డిజి-ధన్‌ వ్యాపార్‌ యోజన :

    నీతీ ఆయోగ్‌ ఈ పథకాలను ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజలలో నగదు రహిత లావాదేవీల కోసంగా డిజిటల్‌ చెల్లింపు పరికరాలను వాడుతున్న వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించడానికి నగదు బహెమతులను ఇవ్వడానికి రూపొందించిన పథకాలు.

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ :

దేశంలో నూతన ఆవిష్కరణలకు అవకాశమిచ్చే విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, పరాశోధనాశాలను ప్రోత్సహిందానికి, అభివృద్ధిపరచడానికి ఉద్దేశించిన వథకం.

బేటి బచావో - బేటిపడావో

ఆడపిల్లను రక్షించు – ఆడపిల్లను చదివించు :

భారత దేశంలో చాలా సంవత్సరాల నుండి స్తీ పురుషుల సంఖ్య మధ్య సమతుల్యం దెబ్బతింది. దేశంలో ప్రస్తుతం 1000 మంది పురుషులకు 943 మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ కారణాల వల్ల ఆడపిల్లలను రక్షించే ఉద్దేశంతో 2014 ఆగష్టు 15 తేదీన ప్రధానమంత్రి బేటీ బచావో, బేటి పడావో పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళా, బాల వికాస మంత్రిత్వశాఖ ఈ చట్టాన్ని తయారుచేసి, దీనిని పర్యవేక్షిస్తుంది. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, ప్రాధమిక విద్య, అక్షరాస్యతా విభాగం దీనికి సహకరిస్తుంది.

 

ముఖ్య లక్ష్యాలు :

  • ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న 100 జిల్లాలలో బాలికల సంఖ్య పెరిగే విధంగా చూడడం.
  • 5 సం॥ల లోపు సంభవించే శిశు మరణాల రేటు 8% నుండి 5% నికి తగ్గించడం.
  • బాలికలకు పౌష్టికాహారం అందించడం.
  • ప్రతి తరగతిలోను బాలికల సంఖ్య పెరిగేలా చూడడం.
  • 2017 సంవత్సరం వరకు అన్ని స్కూళ్లల్లో ఆడపిల్లల కోసం బాత్‌రూం కట్టించాలి.
  • ఆడపిల్లల్ని లైంగిక వేధింపుల నుండి రక్షించే విధానాలు రూపొందించడం.

మనం ఎలా, ఏవిధంగా పనిచేయాలి?

  • సమాజంలోని ప్రజల ఆలోచనా ధోరణి మార్చే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తయారు చేశారు. ప్రచార సాధనాల ద్వారా బాలికల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలు, పట్టణాలలో ఈ చట్టం గురించి ప్రచారం చేయాలి.
  • పంచాయితీ, సమూహాలు, సేవాసంఘాలలోని వ్యక్తులు, అన్ని వర్గాల ప్రజల సహాయంతో దేశంలో ఆడపిల్లలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించాలి.
  • విద్యా హక్కు చట్టం, సర్వశిక్షా అభియాన్‌, మధ్యాహ్న భోజన పథకం, స్మాలర్‌షిప్‌లను సరియైన విధంగా ఉపయోగించుకొని ఆడపిల్లలు పై చదువులు చదివి, ఎదిగేలా ప్రోత్సహించాలి.

·  

Close