-->

కమిషన్‌ లాంటి వ్యవస్థ ఎందుకు ? (Why A Commission Type of Organisation?)

Also Read

 

కమిషన్‌ లాంటి వ్యవస్థ ఎందుకు ? (Why A Commission Type of Organisation?)


      భారత రాజ్యాంగం సివిల్‌ సర్వీస్‌ అధికారుల సిబ్బంది భర్తీ కొరకు సాంప్రదాయక శాఖ పద్ధతిలోని సంస్థలవలె కాకుండ ప్రత్యేకంగా ఉండే ఒక కమిషన్‌ ఏర్పాటు చేసింది. రాజ్యాంగ నిర్మాతలు నైపుణ్యం, ప్రత్యేక పరిజ్ఞానం గల బృందం ఉంటే సమర్ధులైన ఉద్యోగుల ఎంపిక జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఒక కమిషన్‌ ఏర్పాటుకు సూచించారు. నిపుణుల బృందం ఉమ్మడిగా తీసుకొనే నిర్ణయాలనే నిర్ణయీకరణగా పేర్కొంటారు. బహు సభ్య సంస్థ అయిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో వృత్తిపరమైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు నిర్ణయీకరణ చేస్తారు. చాలామంది నిపుణులు కలిసి సమాలోచన చేయడం వల్ల పక్షపాతం పోయి నిష్పక్షపాతంగా ఆలోచించేందుకు వీలుంటుంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వ యంత్రాంగానికి వెలుపల పనిచేయడం వల్ల, నూతన పద్ధతులను అన్వయించడానికి వీలవుతుంది. ఉద్యోగస్వామ్య లోపాలైన జాప్యం, దృఢత్వం వంటి వాటిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు ద్వారా నివారించవచ్చు.


Close