-->

పభుత్వ పరిపాలనా యంత్రాంగం ఎవరిచేత నడపబడుతుంది? (The Need of an Independent Agency)

Also Read

 


స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ యొక్క ఆవశ్యకత (The Need of an Independent Agency) :

ప్రభుత్వ సామర్థ్యం చాలా వరకు పబ్లిక్‌ సర్వీస్‌ అధికారుల పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది. వీరి భర్తీ నిష్పక్షపాతంగా, తటస్థంగా, ఎలాంటి దురభిమానాలకు లోబడకుండ ఉంటుంది. సివిల్‌ సర్వీస్‌ అధికారుల ఎంపిక యోగ్యత లేదా ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. వారి ఎంపిక నిష్పాక్షికంగా జరగడానికి అనేక చర్యలు చేపట్టాలి. అందుకొరకై భారత రాజ్యాంగం ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. ఆ సంస్థ ద్వారా

  1. అత్యున్నత స్థాయిలో పనిచేసే సివిల్‌ సర్వీస్‌ అధికారుల భర్తీని కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి తప్పించడమైనది
  2. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వానికి వెలుపల పనిచేస్తుంది.
  3. ఆ సంస్థకు రాజ్యాంగబద్ధత ఉండడంతో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులను భర్తీ చేసేది అధికారులు నియమించే సంస్థ కాదని గుర్తుంచుకోవాలి. అధికారుల నియామకం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కమిషన్‌ సలహా మరియు సూచనలిచ్చే సంస్థ మాత్రమే. ఆ కమిషన్‌ ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలనే నియమమేదీ లేదు. సాధారణంగా ప్రభుత్వం ఆ కమిషన్‌ సూచనలను పాటిస్తుంది. కానీ ప్రతిసారి ప్రభుత్వం వాటి సలహాలను, సూచనలను ఆమోదించకపోవచ్చు. అయినప్పటికీ ఆ కమిషన్‌ ఇచ్చిన సలహాలను పాటించకపోవడనికి కారణాలను తెలిపి వాటిని భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతాయి.

Close